Tuesday, March 4, 2025

భ్రమల్లో కుమారస్వామి : సిద్ధ రామయ్య ఎద్దేవా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలనుందంటూ జేడీఎస్ నేత హెచ్.డీ కుమారస్వామి చెప్పిన జోస్యాన్ని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కొట్టివేశారు. ఆయన నిరాశా నిస్పృహలతో ఉన్నారని, గతంలో కూడా ముఖ్యమంత్రి అవుతాననే భ్రమల్లో ఆయన గడిపారని ఎద్దేవా చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయన భ్రమలన్నీ తొలిగిపోయాయన్నారు. ఆ కారణం గానే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందంటూ ఇప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ 2019లో తన సారథ్యంలో 14 నెలల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ విధంగా కూలిందో అదే గతి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని జోస్యం చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News