Saturday, November 16, 2024

మీలా బలహీనమైన ప్రధానిని కాను..బలమైన సిఎంను: సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బిజెపిలోని తిరుగుబాటు నాయకులను కట్టడి చేయలేని బలహీనమైన ప్రధానిగా నరేంద్ర మోడీని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం అభివర్ణించారు. కర్నాకలోని శివమొగ్గలో సోమవారం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను సిద్దరామయ్య తిప్పికొట్టారు. లూటీ చేయడంలో భాగస్వామ్యం కోసం కర్నాటకలో పోటీ ఏర్పడిందని, వెయిటింగ్‌లో ఉన్న ముఖ్యమంత్రి, పదవిని ఆశిస్తున్న భవిష్యత్ ముఖ్యమంత్రి, సూపర్ ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి, ఢిల్లీలో కలెక్షన్ మంత్రి అంటూ ప్రధాని మోడీ గుప్పించిన విమర్శలపై సిద్దరామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తిరుగుబాటు నాయకుడు ఈశ్వరప్పపై చర్యలు తీసుకోలేని బలహీనమైన ప్రధాని కాదా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో సూపర్ సిఎంలు, షాడో సిఎంలు ఉన్నారని మీరంటున్నారని, మాకు అలాంటి వారెవరూ లేరని, ర్నది ఒక్కరే బలమైన సిఎం అని సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. నేను మీలాగా బలహీనమైన ప్రధానిని కాను అంటూ కూడా చురకలు అంటించారు. మిమల్ని మీరు 56 అంగుళాల ఛాతీ ఉన్నట్లు వర్ణించుకుంటారని, మిమల్ని విశ్వగురుగా మీ అభిమానులు కీర్తిస్తుంటారని, కాని మీరు మాత్రం పదేపదే బలహీనమైన ప్రధానిగా మిమల్ని మీరు ప్దదర్శించుకుంటున్నారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు.

మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప గతంలో మీ నాయకత్వంపై తిరుగుబాటు చేసి మిమల్ని దూషించారని అలాంటి వ్యక్తుల కాళ్లపై పడి వారిని బతిమాలి తిరిగి పార్టీలోకి తెచ్చుకుని వారితో కలసి ఊరేగి మిమల్ని మీరు బలహీనమైన ప్రధానిగా చూపలేదా అంటూ సిద్దరామయ్య మోడీని నిలదీశారు. కర్నాటకలో మీ నాయకత్వంపై అరడజను మంది నాయకులు తిరుగుబాటు చేశారని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో టికెట్లు రాక మీ నాయకులు రోడ్లపైన కొట్టుకుంటున్నారని, పరస్పర బురద చల్లుకుంటున్నారని సిద్దరామయ్య అన్నారు. మీ విజ్ఞప్తులను ఏమాత్రం వారు ఖాతరు చేయడం లేదని, వారిలో కొందరు తమను కూడా సంప్రదిస్తున్నారని ఆయన చెప్పారు.

క్రమశిక్షణగల పార్టీగా చెప్పుకునే మీ పార్టీలో ఇతటి క్రమశిక్షణారాహిత్యమా అని ప్రశ్నిస్తూ అది మీరు బలహీన ప్రధాని కావడం వల్లే కదా అని సిద్దరామయ్య పేర్కొన్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న పార్టీగా కాంగ్రెస్‌ను ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి పదవికి అర్హులైన నాయకులు చాలామంది తమ పార్టీలో ఉన్నారని, కాని మీ పార్టీలో ప్రధాని పదవికి అర్హులైన ఒక్క నాయకుడిని చూపించండి అంటూ సిద్దరామయ్య మోడీని నిలదీశారు. బిజెపిలో అటువంటి నాయకులే లేరా లేక మీ పదవి పోతుందన్న భయంతో ఇతరులను మీరు ఎదగనివ్వడం లేదా అంటూ ఎక్స్ వేదికగా సిద్దరామయ్య మోడీని ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News