Monday, December 23, 2024

కర్ణాటక సిఎంగా సిద్ధరామయ్య ప్రమాణం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం స్వీకారం చేశారు. శనివారం బెంగళూరులోని కఠీవర స్టేడియంలో ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్, సిద్ధరామయ్య చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉపముఖ్యమంత్రిగా డికె శివ కుమార్ చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లీఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు తమిళనాడు సిఎం స్టాలిన్, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్, సినీ నటుడు కమల్ హాసన్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News