Monday, December 23, 2024

రాజీ ఫార్మూలా లేదు..సిద్ధనే ఐదేళ్ల సిఎం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటక సిఎం సిద్ధరామయ్య పూర్తిగా ఐదేళ్లు ఇదే పదవిలో ఉంటారని, ప్రభుత్వ స్థాపన దశలో ఎటువంటి అధికార పంపిణీ ఫార్మూలా లేదని మంత్రి ఎంబి పాటిల్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పెనుదుమారానికి దారితీసేలా మారుతున్నాయి. సీనియర్ అయిన సిద్ధరామయ్య సిఎం అయ్యారు. ఇక రాజీ ఫార్మూలా ప్రసక్తే లేదని , ముందుగా ఇటువంటిది ఏమైనా ఉండి ఉంటే పార్టీ అధిష్టానం దీని గురించి కనీసం తనవంటి వారికైనా చెప్పి ఉండేదని ఆయన మంగళవారం వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత సిద్ధరామయ్య మారుతాడని, శివకుమార్ ఈ స్థానంలోకి వస్తాడని పలు వార్తలు వెలువడుతున్న దశలో దీనిపై సీనియర్ నేత అయిన పాటిల్ స్పందించారు.

అటువంటి ప్రసక్తే లేదన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఇటువంటి ఫార్మూలా ఉందని ఎవరికైనా చెప్పారా? అటువంటిదేమీ లేదే, ప్రజలతో పవర్ షేరింగ్, వారి బాధ్యతల స్వీకరణ తప్పితే ప్రత్యేక ఫార్మూలా ఏమీ ఉండదని కెసి చెప్పిన విషయాన్ని విలేకరులకు గుర్తు చేశారు. సిద్ధరామయ్య రెండేళ్లు, డికె మూడేళ్లు సిఎంగా ఉంటారని, ఇదే ఇరువురి నడుమ ఇటీవలే పార్టీ అధినాయకత్వం కుదిర్చిన రాజీఫార్మూలా అని పత్రికలలో వార్తలు వెలువడుతున్నాయి. దీనికి భిన్నంగా పాటిల్ మాట్లాడటంతో ఇకపై డికె వర్గీయుల స్పందన ఏమిటనేది చర్చనీయాంశం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News