Monday, January 20, 2025

మధ్యాహ్నం కర్నాటక సిఎంగా సిద్ధరామయ్య ప్రమాణం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో రంగంలోకి దిగిన అదిష్టానం.. సిద్ధరామయ్య, డికె శివకుమార్‌లతో పలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డికె శివకుమార్‌ను అదిష్టానం ఎంపిక చేసింది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలతోపాటు పలువురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News