Sunday, December 22, 2024

మా రాజ్యసభ అభ్యర్థిని బలపరచండి

- Advertisement -
- Advertisement -

Siddaramaiah Writes To JDS MLAs

జెఎడిఎస్ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య లేఖ

బెంగళూరు: తమ పార్టీ రెండవ అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్‌కు అంతరాత్మ ప్రబోధంతో ఓటు వేసి గెలిపించవలసిందిగా జెడి(ఎస్) ఎమ్మెల్యేలను కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, కర్నాకట్ సిఎల్‌పి నాయకుడు సిద్ధరామయ్య గురువారం బహిరంగ లేఖ రాశారు. శుక్రవారం కర్నాటకలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మన్సూర్ అలీ ఖాన్ విజయం వల్ల తమ రెండు పార్టీలు అనుసరిస్తున్న లౌకిక సిద్ధాంతానికి విజయం దక్కినట్లు అవుతుందని సిద్ధరామయ్య తన లేఖలో పేర్కొన్నారు. కాగా..తన పార్టీ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య లేఖ రాయడంపై జెడి(ఎస్) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి మండిపడ్డారు. నామినేషన్ వేసే ముందు తమ పార్టీ నాయకులతో చర్చించి ఉంటే ఇటువంటి సమస్యలు వచ్చి ఉండేవి కావని కుమారస్వామి అన్నారు. మైనారిటీ అభ్యర్థులకు మద్దతివ్వాలని సిద్ధరామయ్య లేఖ రాశారని, అలాంటప్పుడు జైరాం రమేష్‌ను మొదటి అభ్యర్థిగా బరిలో దించడానికి బదులుగా మన్సూర్ అలా ఖాన్‌నే నిలిపి ఉండవలసిందని కుమారస్వామి వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News