Thursday, January 23, 2025

సిఎంగా సిద్దూ పేరు ఖరారు: మహిళా కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య పేరు ఖరారైనట్లు కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కెపిసిసి) మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పా అమర్‌నాథ్ వెల్లడించారు. బుధవారం నాడిక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ సిద్దరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసిందని, మరి కొద్ది సేపట్లో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపారు.

సిద్దరామయ్యతో రాహుల్ గాంధీ మాట్లాడారని, సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆమె చెప్పారు. సిద్దరామయ్య తాము శుభాకాంక్షలు కూడా తెలియచేసినట్లు ఆమె వెల్లడించారు. ఇలా ఉండగా బెంగళూరులోని సిద్దరామయ్య నివాసం వద్ద ఆయన అభిమానుల కోలాహలం మిన్నంటింది. ముఖ్యమంత్రిగా ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనప్పటికీ సిద్దరామయ్య ఇంటి వద్ద ఆయన అభిమానులు ఆయన కటౌట్‌కు పాలాభిషేకం చేసి బాణసంచా కాల్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News