Tuesday, November 5, 2024

బిజెపోళ్లది విచ్చలవిడి ఖర్చు: సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నేతలు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మండిపడ్డారు. 2018 ఎన్నికల్లోనూ ఆపరేషన్ కమల్ జరిగిందని, గత ఎన్నికల్లో బిజెపి నేతలు డబ్బులిచ్చి నేతలను కొనుగోలు చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ వస్తుండగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 62 సీట్లలో విజయం సాధించగా 68 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బిజెపి 28 సీట్లలో విజయం సాధించి 39 సీట్లలో ఆధిక్యంలో ఉంది. జెడ్‌ఎస్ ఆరు సీట్లలో గెలుపొందగా 16 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు రెండు అసెంబ్లీ స్థానాలలో గెలుపొందగా 3 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఢిల్లీ ఎఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలకు హద్దులు అవధులు లేకుండాపోయాయి. కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నాయి. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Also Read: కర్నాటక ఫలితాలే తెలంగాణలోనూ రాబోతున్నాయి: రేవంత్ రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News