Monday, December 23, 2024

సిద్ధరామయ్య ముందంజ…. శ్రీరాములు వెనుకంజ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నిలకల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కర్నాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ దూసుకపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 116 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా బిజెపి 72, జెడిఎస్ 30, ఇతరులు 6 స్థానాలలో లీడ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్(113) దాటి పోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. సెంట్రల్ కర్నాటక, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి కర్నాటకలో, మైసూరులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కోస్టల్ కర్నాటకలో బిజెపి ముందంజలో ఉంది.

Also Read: డికె ముందంజ…. కుమారస్వామి వెనుకంజ

ఈ ఎన్నికల ఫలితాలలో ఎనిమిది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. సొరబ స్థానంలో బంగారప్ప కుమారుల మధ్య పోటీ నెలకొంది. కుమార బంగారప్ప(బిజెపి)పై మధు బంగారప్ప(కాంగ్రెస్) ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్య, కనకపురా స్థానంలో డికె శివకుమార్, చిత్తపూర్ మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్, కొరటగెరె స్థానంలో జి పరమేశ్వర్లు ఆధిక్యంలో ఉన్నారు.

బిజెపి నుంచి షిగ్గావ్ స్థానంలో బస్వారాజ్ బొమ్మై, శికారిపురలో యడియూరప్ప కుమారుడు విజయేంద్ర, జెడిఎస్ నుంచి చెన్నపట్టణ స్థానంలో కుమార స్వామి, మోళెనర్సీపూర్ నియోజవర్గం నుంచి రేవన్న, రామనగరలో నిఖిల్ కుమారస్వామిలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

గాంధీనగర్ స్థానంలో దినేష్ గుండూరావు(కాంగ్రెస్), బళ్లారి పట్ణణంలో గాలి లక్ష్మీ అరుణ వెనుకంజ, చిక్కబళ్లాపూర్ స్థానంలో సుధాకర్(బిజెపి), బళ్లారి(ఎస్‌టి) స్థానంలో శ్రీరాములు(బిజెపి), హుబ్బళి ధార్వాడ్ సెంట్రల్ జగదీశ్ షెట్టార్ (కాంగ్రెస్), చిక్కమగళూరు స్థానంలో సిటి రవి(బిజెపి) వెనుకంజలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News