Monday, December 23, 2024

నా తల్లిదండ్రులను వేధించారు: హీరో సిద్దార్థ్

- Advertisement -
- Advertisement -

తమిళనాడులోని మధురైలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను వేధించారని ప్రముఖ నటుడు సిద్ధార్థ్ ఆరోపించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌లో భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను వారిని ఇబ్బంది పెట్టారని వాపోయాడు. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ దాదాపు 20 నిమిషాల పాటు తన పేరెంట్స్ ను వేధించారని చెప్పుకొచ్చాడు. వారి బ్యాగుల నుంచి వస్తువులను తొలగించారని, ఇంగ్లీష్ మాట్లాడాలని అడుగుతున్న.. వారితో హిందీలో మాట్లాడి ఇబ్బంది పెట్టారని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌పై ఆరోపణలు చేశాడు. సిద్ధార్థ్ దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో అనేక తమిళ, తెలుగు, హిందీ చిత్రాలలో నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News