- Advertisement -
చెన్నై: ‘పుష్ప-2’ సినిమా విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని నటుడు సిద్ధార్థ్ స్పష్టీకరణ ఇచ్చారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఆయన సినిమా ‘మిస్ యూ’ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ‘మిస్ యూ’ ప్రమోషన్ లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. అల్లు అర్జున్ తో తనకు ఎలాంటి సమస్యలు లేవని ఓ ప్రశ్నకు జవాబిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతుండాలని ఆయన కోరుకున్నారు.
- Advertisement -