Sunday, December 22, 2024

పెళ్లి జరిగేది అక్కడే..

- Advertisement -
- Advertisement -

హీరో సిద్ధార్థ్ , హీరోయిన్ అదితిరావు హైదరీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల వారి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా అదితిరావు హైదరీ తన పెళ్లి గురించి మాట్లాడుతూ “వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. మా నిశితార్థం అక్కడే జరిగింది. పెళ్లి కూడా అక్కడే ఉంటుంది. పెళ్లి తేదీ ఖరారు కాగానే మేమిద్దరం వెంటనే ప్రకటిస్తాం”అని అన్నారు. ఇక హీరో సిద్ధార్థ్ , హీరోయిన్ అదితిరావు హైదరీ కలిసి తొలిసారి ‘మహాసముద్రం’ చిత్రంలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారి పెళ్లి వరకూ వెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News