Wednesday, January 22, 2025

ఎల్‌ఐసి కొత్త చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) కొత్త చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి నియమితులయ్యారు. ఆయన 2024 జూన్ 29 వరకు బాధ్యతల్లో కొనసాగనున్నారు. మొహంతి గతంలో ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఎండి, సిఇఒ సేవలందించారు.

ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, కంపెనీ నలుగురు డైరెక్టర్లలో ఒకరిని ఎల్‌ఐసి చైర్మన్‌గా ఎంపిక చేస్తారు. సిద్ధార్థ పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్‌ఎస్‌ఐబి) సిఫారసు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ నియామకాల కమిటీ(ఎసిసి) ఎల్‌ఐసి చైర్మన్‌గా మొహంతి నియామకంపై నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News