Sunday, December 22, 2024

దేవాలయాల, రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేట

- Advertisement -
- Advertisement -
  • చెత్తలేని ఆకుపచ్చ సిద్దిపేటగా మార్చాం
  • త్వరలో సిద్దిపేటలో 25 కోట్లతో వెంకటేశ్వర స్వామి దేవాలయం
  • ప్రతిఒక్కరూ నిత్యం వాకింగ్‌తో పాటు యోగా, ప్రాణామయం చేయాలి
  •  సిఎం కెసిఆర్ చొరవతో 5 రిజర్వాయర్లు నిర్మించుకున్నాం
  •  విద్యకు నిలయంగా సిద్దిపేట
  •  త్వరలో సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి ప్రారంభం
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: దేవాలయాల, రిజర్వాయర్ల ఖిల్లాగా సిద్దిపేట జిల్లా మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గణేశ్ నగర్ ప్రసన్నాంజనేయ దేవాలయ ఆవరణలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీరామ కల్యాణ మండపం నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు సిద్దిపేట జిల్లాలో ఒక్క రిజర్వాయర్ లేదని సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో 5 రిజర్వాయర్లను నిర్మించుకున్నామన్నారు. సిద్దిపేట విద్యకు నిలయంగా మారిందన్నారు. అన్ని రకాల చదువుల విద్యాలయాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. సిద్దిపేట టిటిడి ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని టిటిడి బోర్డు చైర్మన్ సుబ్బిరామిరెడ్డి ఇటీవల కలవడం జరిగిందన్నారు.

వెంటనే సానుకూలంగా స్పందించారన్నారు. ఆయన కోమటి చెరువు వద్ద 6 ఎకరాలలో 25 కోట్లతో నిర్మించనున్న స్వామి వారి ఆలయానికి శంకుస్థ్ధాపన చేయబోతున్నామన్నారు. సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు రాముల వారి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నారు. ప్రతిఒక్కరూ నిత్యం, వాకింగ్‌తో పాటు, యోగా ప్రాణామయం చేయాలన్నారు. త్వరలో సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు. గుండె, క్యాన్సర్‌కు సంబంధించిన వైద్య సేవలను ఉచితంగా సిద్దిపేటలోనే అందించబోతున్నామని అన్నారు.

చెత్త లేని పరిశుభ్రమైన సిద్దిపేటగా మార్చుకున్నామన్నారు. నాలుగు నెలల లోపే ఈ కల్యాణ మండపాన్ని పూర్థి స్థాయి సదుపాయాలతో నిర్మించి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆలయ అర్చకులు రమణాచార్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్ రెడ్డి, పూజల వెంకటేశ్వర్లు చిన్న, శేషుకుమార్, పెసరు రాజు, బుస్స శ్రీనివాస్, సత్యనారాయణ, శోభా రఘురాం, సద్ది నాగరాజు రెడ్డి, సాయన్నగారి సుందర్, మడూరి కిట్టు, సూరి, లిఖిత్, బాల్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News