Monday, December 23, 2024

విద్యార్థి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: ఓ విద్యార్థి వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు… ఆమె మరొకరుతో చనువుగా ఉండడంతో బరించలేక అతడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా సుచిత్ర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ గ్రామానికి చెందిన లగిశెట్టి అభిషేక్(19) హైదరాబాద్ డిగ్రీ చదువుతున్నాడు. షాపింగ్‌మాల్‌లో ఓ వివాహితతో పరిచయం ఏర్పడడంతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో అభిషేక్ బరించలేకపోయాడు. మానసిక వ్యథనకు గురికావడంతో తన సొంతూరులో పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రులు గమనించి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అభిషేక్ చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News