Sunday, December 22, 2024

బాసర ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ప్రథమ స్థానంలో సిద్దిపేట జిల్లా

- Advertisement -
- Advertisement -

బాసర ట్రిపుల్ ఐటీ లో ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 1,404 సీట్లలో 330 సీట్లు సిద్దిపేట జిల్లా విద్యార్థులు సాధించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించి సిద్దిపేట జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది విద్యాశాఖ అధికారులు , ఉపాధ్యాయుల కృషి ఫలితమఅని, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందుతుందని ఈ విజయం విద్యార్థుల మేధస్సుకు ,తపనకు నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. మంచి ర్యాంకుల సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News