Wednesday, January 22, 2025

భూమి దక్కదన్న భయంతో రైతు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: రసాయన గుళికలు మింగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు గ్రామస్ధులు తెలిపిన వివరాల ప్రకారం మిరుదొడ్డి గ్రామానికి చెందిన మద్దెల కిష్టయ్య తండ్రి రాజయ్య (75) 35 సంవత్సరాల క్రీతం మర్పడగ విజేందర్ వద్ద 7 ఎకరాల భూమి కొనుగోలు చేసి కబ్జాలో ఉండగా సాదాబైనామ చేసి రిజిస్ట్రేషన్ చేయకుండా విజేందర్‌రెడ్డి 2002లో చనిపోగా కుటుంబ సభ్యులు హైదరాబాద్ పోయి అతని బార్య అజితకు చెప్పి అడడగా నెలలోపు చేస్తామని చెప్పాని తెలిపాడు. ఆమె పాలివారైన మర్పడగ విజయ ఆమె మరిది విజేందర్ రెడ్డి ఇరువురు మెసపూరితంగా అదే భూమి మిరుదొడ్డి గ్రామానికి చెందిన బెక్కంటి దేవయ్య, బెక్కింటి మురళిలకు అమ్మి రిజిస్ట్రేషన్ చేశారు.

భూమిలోకి వచ్చే ప్రయత్నాలు చేయగా వారికి దొమ్మాశట గ్రామానికి చెందిన డప్పు శివరాజం, వెంకటాపూరం గ్రామానికి చెందిన కాశమైన దయాకర్, బైండ్ల నందు, మిరుదొడ్డికి చెందిన ఎలుముల కుమార్, మేడ్చేల్‌కు చెందిన రామేశ్వర్ హైదరాబాద్‌కు చెందిన మర్పడగ రవీందర్‌రెడ్డి సహకరించిభూమిలో నుండి వెళ్లి పొండి లేకుంటే చంపుతామని బెదించడంతో భూమి తనకు కాకుండా బ్రతకడం దండుగ అని భాదపడుతూ ఈ నెల 17న రసాయన గుళికలు మింగి కబ్జాలో ఉన్న పోలంలో పడిపోగా చికిత్స గురించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. వ్యక్తుల వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుమారుడు మద్దెల నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ శ్రీదర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News