సిద్దిపేట : జాతీయ మార్కెట్‌లో సిద్దిపేట చేపలు వెళ్లడంతో మత్సకారులకు ఆశాజనకంగా మారిందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలంలో మత్సకారులు మంత్రి హరీశ్‌రావు, చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి ఆద్వర్యంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరిగి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏడాది పోడవునా చెరువులు, కాల్వల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని తెలిపారు. ఉచిత చేపపిల్లల పంపిణీ పేరిట సిద్దిపేట జిల్లాలోని చెరువులు, జలాశయాల్లోకి కోట్లాది చేప పిల్లలను విడుదల చేశామన్నారు.
సిద్దిపేట జిల్లాలో చేపల ఉత్పత్తి పెరిగిందన్నారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్ , నియోజక వర్గంలోని పలు చెరువుల్లో పట్టిన చేపలను పశ్చిమ బెంగాల్, కలకత్తా, మహారాష్ట్రలోని చంద్రాపూర్, ఆంద్రప్రదేశ్ లోని విజయ వాడ,రాజమంత్రి , కాకినాడకు ఎగుమతి చేస్తున్నామన్నారు. తమ ప్రాంతంలో పెరిగిన చేపలు కలకత్తా , హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి ,మహారాష్ట్ర, చందాపూర్ పక్క రాష్ట్రాలకు ఎగుమతి అవడం సంబురంలో మునిగి తేలుతున్నారు. కిలో నుంచి దాదాపు 12 కిలోలు ఉన్న చేపలు ఉన్నాయని డిమాండ్ మరిత బాగుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మత్సకారుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.