- శంకర మఠం సనాతన ధర్మ వ్యాప్తి కేంద్రం
- పీఠాధిపతుల మంగళ శాసనాలే నేటి రాష్ట్రాభివృద్ధి
- నాటి నుండే పీఠాధిపతులతో సిద్దిపేట ఎంతో అనుబంధం
- ఎన్నో జీర్ణా దేవాలయాల పునరురద్ధరణకు వారి ఆశీస్సులు అమోఘం
- వర్గల్‌లో శంకర మఠం ఏర్పాటు కావడం, భాగస్వామ్యం కావడం ఎంతో పుణ్యం
- రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
వర్గల్: అధ్యాత్మికతను ఒడిసి పట్టిన నేల సిద్దిపేట అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం వర్గల్ సరస్వతి క్షేత్రంలో మూడు కోట్ల వ్యయంతో నిర్మించిన కంచి కామ కోటి పరం వారి సర్వజ్ఞ శంకర మఠాన్ని కంచి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య, విజయేంద్ర సరస్వతి స్వామిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంచి పీఠాధిపతుల అదేశంతో వర్గల్‌లో శంకర మఠం రికార్డ్ సమయంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారన్నారు. అధ్యాత్మిక భావాలు వ్యాప్తి చేయడంలో వర్గల్ దేవాలయం ఒక మోడల్ గా నిలుస్తుందన్నారు. చంద్ర శేఖర శర్మ సిద్దాంతి కృషి అనితర సాద్యం త్వరలో మర్పడగ క్షేత్రంలో కూడా శంకర మఠాన్ని నిర్మించిన సనాతన ధర్మ వ్యాప్తికి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
సిద్దిపేటలో కంచి పీఠాధిపతుల శోభ యాత్ర నిర్వహిస్తామన్నారు. సిఎం కెసిఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కంచి స్వాములు సిద్దిపేట సందర్శించి బోగేశ్వరాలయ పునరద్ధరణ సంకల్పం చేశారు. ఇప్పుడు పునరుద్ధరణ జరిగిన బోగేశ్వరాలయం సందర్శనకు వచ్చే పర్యటనలో స్వామి వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. కంచి కామకోటి పీఠాధితులు జగద్గురు శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు చేయడం ముదావహం శంకర మఠాల ద్వారా ధర్మ ప్రచారం విరివిగా జరగాలన్నారు. రాజకీయ నాయకత్వంతో పాటు అధ్యాత్మిక నాయకత్వం చాలా అవసరమన్నారు.
వేద సంరక్షణ గోసం రక్షణ సంస్కృతి పరిరక్షణకు అధ్యాత్మిక నాయకత్వం అవసరమన్నారు. హరీశ్‌రావు ప్రజాభిమానం ఉన్న సంస్కారవంతమైన నాయకులు అన్నారు. అనంతరం విద్యా సరస్వతి మాతను మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అదే విధంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కంచి స్వామిజీని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి రాజశేఖర్ శర్మ, డాక్టర్ చెప్పల హరినాధ్ శర్మ, వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాదాసు శ్రీనివాస్, ఎన్‌సి రాజమౌళి, బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.