Wednesday, January 22, 2025

సిద్దిపేట అంటేనే పరిశుభ్రతకు మారుపేరు

- Advertisement -
- Advertisement -
  • స్వచ్ఛతలో మీరంతా భాగస్వామ్యం కావాలి
  • ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం
  • మీ ప్రేమ, ఆదరాబిమానం, ఉన్నంత కాలం సిద్దిపేట అభివృద్ధికి నాశక్తి దారపోస్తా
  • స్థలం కేటాయించిన సంఘాలకు త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: సిద్దిపేట అంటేనే పరిశుభ్రతకు మారుపేరు అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలంలో లైట్ మోటార్ వెహికిల్ అసోసియేషన్ భట్రాజ్ సంఘం, మొండివారు, మొండి సంఘం, మొబైల్ అసోసియేషన్‌లకు స్థల భవనాలు మంజూరు చేసి ప్రోసిడింగ్ కాపీలను ఆయా సంఘ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్చతలో మీరంతా బాగస్వామ్యం కావాలన్నారు. ప్రజలందరి బాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. విద్య, వైద్యం , ఆలయాల అభివృద్ధి నిర్మాణాలలో అన్నింటా ఆదర్శంగా నిలించిందన్నారు. మీప్రేమ , ఆదరాబిమానం, ఉన్నంత కాలం సిద్దిపేట అభివృద్ధికి నాశక్తి దారపోస్తానన్నారు. స్థ్ధలం కేటాయించిన సంఘాలకు త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. ఇప్పటికే నియోజక వర్గంలో 60 కుల సంఘాలకు స్థలాన్ని ఇవ్వడంతో పాటుగా భవనాలు నిర్మించి ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. కుల సంఘ ప్రతినిధులు గత ప్రభుత్వాలు తమను పట్టించుకున్న దాఖాలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు రాజనర్సు, రవీందర్‌రెడ్డి, సాయిరాం, మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, మొబైల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడిత్యాల సునిల్‌కుమార్ , నయిమ్ , వెంకట్, రాజిరెడ్డి, లైట్ మోటర్ వెహికల్ సంఘం అధ్యక్షుడు రమేశ్, దయానంద్, ఆశోక్, సంచార జాతుల మొండివారు మొండి బండ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News