Wednesday, January 22, 2025

పల్లె సోయగం.. పట్టణ పరవశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట రూరల్: సిద్దిపేట ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుంది. మంత్రి హరీశ్‌రావు కృషితో రాష్ట్రంలోనే ఆదర్శ నియోజక వర్గంగా విరాజిల్లుతుంది. సిద్దిపేట ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన కోమటి చెరువు మరో కొత్త కళను సంతరించుకోనుంది. శిల్పారామం అంటే హైదరాబాద్ హైటెక్ సిటీ, తిరుపతిలో విజయవాడ ప్రాంతంలో చూస్తూ ఉం టాం. కానీ మన సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు కృషితో హైదరాబాద్ ఉప్పల్, హైటెక్ సిటీ వద్ద ఉండే ఆ తరహాలో అందుకు దీటుగా శిల్పారామం, శిల్ప కళా వేదిక సిద్దిపేటలో ఏర్పాటు కానుంది. మంత్రి హరీశ్‌రావు కృషితో రూ.25 కోట్లతో కోమటి చెరువు నెక్లెస్ రింగ్ రోడ్డులో బైపాస్ రోడ్డులో సంస్కృతి సాంప్రదాయం ఉట్టి పడేలా.. వృత్తి నైపుణ్య జీవన విధానాలను తెలిసేలా అద్బుతమైన శిల్పారామం మన సిద్దిపేటలో నిర్మాణం కానుంది. నేడు మంత్రి హరీశ్‌రావు శంకుస్థ్ధాపన చేయనున్నారు.

పర్యాటకులను ఆకట్టుకునే ఆటలు..
21 రకాల సౌకర్యాలు

సిద్దిపేట శిల్పారామంలో హైదరాబాద్‌కు దీటుగా సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి. పర్యాటక శోభ, సంస్కృతి సంప్రదాయంతో పాటు ఆకట్టుకునే ఆటలు వచ్చే ప్రజల కు పర్యాటకులకు ఎంతో ఆకర్షించనున్నాయి. ఇందులో వాటర్ ఫౌంటెన్, పుడ్ కోర్టు, బజార్ స్టాల్స్, రాక్ గార్డెన్, బంకెట్ హాల్, గో కార్టింగ్, చిల్డర్స్ ప్లే ఏరియా, స్కూటర్స్, గజేబో, కిడ్స్‌పుల్ ఏరియా , కాటేజస్, డెక్ స్విమ్మింగ్ ఫు ల్, బంపర్ కార్స్, జోరబింగ్, పిష్‌ప, గల్ప్‌కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, వాలిబాల్ కోర్ట్, కబడ్డి కోర్టు, ఆర్టిఫిషయల్ బీచ్ ఇలా 21 సౌకర్యాలు పెద్దలు, పిల్లలు ఆటలు ఆడుకునే గోప్ప వేదికగా సిద్దిపేట ప్రజల ముందుకు రానుంది.

మీని బీచ్‌గా కోమటి చెరువు

కోమటి చెరువు బైపాస్ రోడ్డులో మీని బీచ్ ఏర్పాటు కా నుంది. సిద్దిపేట కోమటి చెరువు చుట్టు మణిహారంగా నెక్లె స్ రోడ్డు పూర్తి స్ధాయిలో చుట్టు కానుంది. బై రోడ్డులో ఆ ర్టీ ఫిషయల్ బీచ్ మిని బీచ్ కోమటి చెరువు వద్ద ఏర్పాటు కానుంది. ఇక సిద్దిపేట ప్రజలు వైజాన్ లాంటి ప్రాంతాల వద్ద ఉండే బీచ్‌ల వద్దకు కాకుండా సిద్దిపేటలోనే వెళ్లే విధంగా మంత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.

సిద్దిపేట శిల్ప కళావేదిక… 1500 మంది కూర్చునే అద్భుతమైన కళా వేదిక

కోమటి చెరువు ప్రాంతంలో నిర్మించే శిల్పారామంలో సిద్దిపేట శిల్పా కళా వేదికగా 1500 మంది కూర్చునే సిట్టింగ్ తో పెద్ద ఆడిటోరియం ఏర్పాటు కానుంది. ఇందులో సాం స్కృతిక కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలు పలు కార్యక్రమాలకు వేదిక కానుంది.
ఇప్పటికే సిద్దిపేటలో 1000మంది కూర్చునే ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం విపంచి కళానిలయంతో పాటు మరో వేదికగా శిల్పా కళా వేదిక నిర్మాణం కానుంది.

సకల కళలకు నియలం శిల్పారామం

హైదరాబాద్ హైటెక్ సిటీ ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన శిల్పారామం తరహాలో సిద్దిపేట సకల శిల్ప కళలకు నిలయ ంగా మారనుంది. భారతదేశంలో ఉన్న అన్ని రకాల సం స్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవాలంటే శిల్పా రా మాన్ని తప్పక సందర్శించేలా హస్తకళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడతాయి. ప్రఖ్యాతిగాంచిన క ళలు, హస్తకళా వస్తువుల గ్రామం శిల్పారామంగా నెలవు కానుంది. దేశంలో పురాతన కళలు సంప్రదాయాలు మరిచపోకుండా వాటిని రక్షించే క్రమంలో పల్లె సోయాగం సాంస్కృతిక వైభవాన్ని సంప్రదాయంను విరజిల్లేలా కోమటి చెరువు గొప్ప పర్యాటక కేంద్రంగా మారనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News