Monday, January 20, 2025

సిద్దిపేట ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • సిద్దిపేట మున్సిపాలిటీ పనితీరు అద్భుతం
  • తమిళనాడు త్రిచి మున్సిపల్ కౌన్సిల్, అధికారుల బృందం కితాబు

సిద్దిపేట: సిద్దిపేట పట్టణ అభివృద్ధి సంస్కరణాలు కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని తమిళనాడు రాష్ట్రానికి చెందిన త్రిచి మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ అధికారుల బృందం తెలిపారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రెండు రోజుల పర్యటన భాగంగా మంత్రి హరీశ్‌రావుతో కలిసి సిద్దిపేట అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధిపేట మున్సిపాలిటీ అభివృద్ధి గురించి విన్నాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజల్లో అవగాహన కల్పించి ఏలా మార్పు తెచ్చారో తెలుసుకుని ఎంతో నేర్చుకున్నామని తమ తమిళనాడు రాష్ట్రంలోని త్రిచి మున్సిపాలిటీ కార్పోరేషన్‌లో అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి హరీశ్‌రావుతో పట్టణ శివారులోని హరిత హోటల్‌లో భేటీ అయ్యారు. తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా చేయడం ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ, సిద్దిపేట మున్సిపాలిటీ పరిపాలనలో స్టీల్ బ్యాంకు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు, సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు రాష్ట్రానికి చెందిన త్రిచి మున్సిపాలిటీ కార్పొరేషన్ కౌన్సిల్, అధికారుల బృందం ప్రశంసించింది. ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలోని 4వ పెద్ద నగరం 15 లక్షల పైచిలుకు జనాభా కలిగిన త్రిచి మున్సిపాలిటీ కార్పోరేషన్ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మున్సిపాలిటీ ని సందర్శించడం గర్వించదగ్గ విషయమని చెప్పారు.

నిత్యం తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా చేసి ఇచ్చే సిద్ధిపేట ప్రజల విజయంగా చెప్పుకొచ్చారు. మంగళవారం ఉదయం సి ద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ, 24వ వా ర్డుల్లో తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా ప్రజలు ఇస్తున్న తీరును త్రిచి మున్సిపల్ బృందం ఇంటింటా తిరిగి పరిశీలించింది. పలు గృహాల్లోని గృ హిణులతో మాటామంతి కలిపి తడి, పొడి చెత్త వేర్వేరుగా చేసి ఇవ్వడం మీకెలా సాధ్యమైందని ప్రజలను ఆరా తీశారు. 24 వ వార్డులో స్టీల్ బ్యాంకు చూసి త్రిచి మున్సిపాలిటీ బృందం ఫిదా అయ్యింది. అనంతరం బుస్సాపూర్ లోని డంప్ యార్డులో ప్రతీ యూనిట్ గురించి ఆరా తీస్తూ దాదాపు గంటకుపైగా తెలుసుకుంటూ యా ర్డు మొత్తం కలియ తిరిగారు.

అనంతరం పట్టణంలోని స్వచ్ఛబడిలో అడుగడుగునా ఆరా తీస్తూ దాదాపు రెండు గంటలు ప్రతీ అంశంపై క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సిద్దిపేట శివారులోని హరిత హోటల్‌లో మంత్రి హరీశ్ రావుతో కలిసి లంచ్ చేశారు. అనంతరం డీ ఆర్సీసీ కేంద్రాన్ని, ఆ తర్వాత సిద్ధిపేట ప్రభుత్వ ద వాఖానను సందర్శించారు. తెలంగాణ రా ష్ట్ర సంస్కృతి బతుకమ్మలు పేర్చి బతుకమ్మ ఆట పాటలు ఆడిపాడారు. ఈ మేరకు ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పరిపాలన రంగంలో సిద్దిపేట మున్సిపాలిటీ అమలు చేస్తున్న పలు విధి, విధానాలను ప్రశంసించారు. ప్రధానంగా బుస్సాపూర్‌లో శాస్త్రీయ పద్ధతిలో డంప్ యార్డ్ నిర్వహణ, వ్యర్థాల నుండి సీఏన్జీ గ్యాస్, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు, హానికరమైన చెత్తను దహనం ఇన్సినరేటర్ వినియోగం, దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన స్వచ్ఛబడిని సందర్శించి మంత్రముగ్ధులయ్యారు.

సిద్దిపేట మున్సిపాలిటీలో అమలవుతున్న కార్యక్రమాలను తమిళనాడు రాష్ట్రంలోని త్రిచి మున్సిపల్ కార్పొరేషన్‌లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని త్రిచి మున్సిపల్ కార్పొరేషన్ బృందం తెలిపింది. సిద్ధిపేటలో ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు మంచి విజన్ ఉన్న నాయకుడని, సిద్ధిపేట మున్సిప ల్ రంగంలో ఎన్నో సంస్కరణలు, వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేశారని క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైందని బృందం తెలిపింది. ఈ విషయమై మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ తరహాలో త్రిచి అభివృద్ధి జరిగేలా తమిళనాడు రాష్ట్ర మున్సిపల్ మంత్రి కే.ఎన్. నెరు, విద్యాశాఖ మంత్రి అబిల్ మగేష్, త్రిచి మే యర్ అన్ బలగన్, కమిషనర్-ఐఏఎస్ వైద్య నాథన్ లకు తెలిపి వారికి సహకరిస్తున్న ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

వీటిలో ప్రధానంగా ఇంటింటికి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణకై ప్రజలను చైతన్యం చేసిన తీరును మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు వివరించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్‌లో శాస్త్రీయ పద్ధతుల అమలు, వేస్ట్ టూ వెల్త్, నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు, ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్, ఆస్తిపన్ను మదింపు, పట్టణ ప్రగతి తదితర ఎన్నో వినూత్న పథకాలు అమలు చేస్తున్నామని సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల/రాజనర్సు తమిళనాడు త్రిచి మున్సిపాలిటీ బృందానికి వివరించారు. ఈ సందర్శనలో డిప్యూటీ మేయర్ దివ్య ధనకొడి, మూడు జోనల్ చైర్మన్లు జయ నిర్మల, దుర్గాదేవి, విజయలక్ష్మి, మాజీ మేయర్ సుజాత, శానిటరీ ఆఫీసర్ కార్తికేయ, త్రిచి మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సమన్వయ కర్త సునీత, పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి, సిద్దిపేట మున్సిపల్ కౌన్సిలర్లు దీప్తి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News