Sunday, December 22, 2024

సిద్దిపేట అన్నిరంగాల్లో ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • ప్రతిఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు పాటు పడాలి: సిపి శ్వేత

సిద్దిపేట: సిద్దిపేట అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని సిపి శ్వేత అన్నారు. ఆదివారం ప్రభుత్వ గర్ల్ హైస్కూల్ మైదానంలో సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, పోలీస్ శాఖ ఆద్వర్యంలో స్వచ్ఛ ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా సిద్దిపేట పట్టణ మహిళలకు ,బాలికలకు ప్రత్యేకంగా 3కె రన్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి శ్వేత హాజరై రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా సిద్దిపేటలో ఉన్న చైతన్యాన్ని రాష్ట్రానికి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా అభివృద్ధికి మారుపేరుగా నిలుస్తున్న సిద్దిపేట ఎన్నో రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆరోగ్య సిద్దిపేటలో భాగంగా మంత్రి హరీశ్‌రావు చోరవతో తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచానికి తలమానికంగా వెల్లు విరుస్తున్న రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై ఆగస్టు 6న హాఫ్ మారథాన్ రన్ నిర్వహిస్తున్నామన్నారు.

సిద్దిపేట పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు యువతి, యువకులు , ప్రజాప్రతినిదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రతిఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు పాటుపడాలన్నారు. ప్రతిరోజు వాకింగ్, రన్నింగ్, యోగా, ద్యానం, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలన్నారు. 24గ ంటల్లో ఒక గంట మన కుటుంబం మన ఆరోగ్యం గురించి సమయం కేటాయించుకోవాలన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింగ్ …. https://shm23.iq301.com ఈ లింక్ ఓపెన్ చేసి వారి యొక్క వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని హాఫ్ మారథాన్ రన్‌లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. హైదరాబాద్ అథ్లెటిక్ కోచ్ నిరంజన్ రన్ ఎలా ప్రాక్టీస్ చేయించి రన్ చేసే ముందు వామ్ ఆప్‌ఎలా చేయాలో 5కె,10కె,21 కె ఎలా పూర్తి చేయాలో సమయస్పూర్తి గురించి ప్రాక్టీస్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోట్ నిరంజన్, ఎస్బి ఇన్‌స్పెక్టర్ రఘుపతిరెడ్డి, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ బిక్షపతి, వార్డు కౌన్సిలర్ పయ్యావుల పూర్ణిమ, సుజాత ఫిజికల్ డైరెక్టర్, సువర్ణ పిఈటి, మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ దుర్గ, పట్టణ మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, బాలికలతు , సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తుల బాపురెడ్డి, కార్యవర్గ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News