Sunday, December 22, 2024

పచ్చదనానికి పరిశుభ్రతకు మారుపేరు సిద్దిపేట

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట పట్టణానికి ఎన్నో రివార్డులు అవార్డులు: సిపి శ్వేత

సిద్దిపేట: స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి సిద్దిపేట పట్టణానికి ఎన్నో రివార్డులు, అవార్డులు వచ్చాయని సిపి శ్వేత తెలిపారు. ఆదివారం స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో వాక్ చేస్తూ తడి, పొడి చెత్తను తీసివేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పచ్చదనానికి పరిశుభ్రతకు సిద్దిపేట పట్టణం మారు పేరుగా నిలుస్తుందన్నారు. ప్రతిఒక్కరూ తడి, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలన్నారు. ఎవరు కూడా గల్లీలలో వార్డుల్లో మెయిన్ రోడ్లపై తడి, పొడి చెత్త వేయవద్దన్నారు. పట్టణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దని వీటి ద్వారా పర్యావరణ ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రజలలో మార్పు వస్తే గ్రామాలలో కూడా మార్పు వస్తుందన్నారు.

మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్వచ్ఛ సిద్దిపేట, ఆరోగ్య సిద్దిపేట గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. సిద్దిపేట ఒక అందమైన పట్టణమని మరింత అందంగా ఉంచడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక పర్యవరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి, ఎసిపి సురేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణారెడ్డి, వార్డుల కౌన్సిలర్లు, అధికారులు, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తుల బాపురెడ్డి, కార్యవర్గ సభ్యులు పరందాములు, రాజిరెడ్డి, ఆశోక్, రాజు, సుజాత, మాలతి, సురేందర్‌రెడ్డి, రమాదేవి, రాజిరెడ్డి, అనిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News