Monday, December 23, 2024

హిజ్రాను హత్య చేయించిన భార్య…

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: హిజ్రాగా మారి భార్యను వేధిస్తున్న భర్తను ఆమె హత్య చేయించిన సంఘటన సిద్దిపేటలో జరిగింది. నిందితురాలితో మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. 2014లో వేదశ్రీ, వెంకటేశ్‌కు వివాహం జరిగింది. ఈ దంపతులకు 2015లో కూతురు జన్మించింది. వేదశ్రీని అదనప్పు కట్నం భర్త ప్రతీ రోజు వేధించేవాడు. రోజు రోజుకు వేధింపులు పెరగాయి. ఈ క్రమంలో అతడిలో మార్పులు వచ్చి హిజ్రాగా మారాడు. తన పేరు రోజాగా మార్చుకొని భార్యనే వేధింపులకు గురి చేసేవాడు. వేద శ్రీ ఓ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తుంది. బోయిని రమేశ్‌తో పరిచయం కావడంతో వివాహేతర సంబందానికి దారితీసింది. భర్త ఆమెను వేధించడంతో హత్య చేయాలని ప్రాణాళిక వేశారు. రమేష్ మరో నలుగురు సహాయంతో ప్లాన్ ప్రకారం రోజాకు మద్యం తాగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్యను అదుపులోకి తీసుకొని విచారించడంతో తానే హత్య చేయించానని ఒప్పుకుంది. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ముగ్గురు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News