హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లాలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో స్నేహిత మహిళా సహకార కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు, రాజకీయం,జర్నలిస్టులు పండుగ సెలవులు లేకుండా తమ పిల్లలను, వారి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నిరంతరం పని చేస్తారని ప్రశంసించారు. పోలీసులకు 55 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఆరోగ్య రక్షణ కార్యక్రమం రెండేళ్ల పాటు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. అవసరమైతే కొద్ది రోజులు పొడగిస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు సిద్దిపేట పోలీస్‌స్టేషన్ ఆదర్శంగా నిలవాలని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా సిద్ధిపేటను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. సిద్ధిపేట అన్ని విషయాల్లో ముందు ఉంటుందని అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో సిద్ధిపేట నంబర్ వన్ అని మంత్రి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు.