సిద్దిపేట: పట్టణ ప్రగతి 2021- 22 సంవత్సరానికి గాను ఈరోజు హైదరాబాద్ వెంగల్ రావు నగర్ లో నిర్వహిచిన పట్టణ ప్రగతి పురస్కారాలలో భాగంగా ఉత్తమ సానిటేషన్ పట్టణంగా సిద్దిపేట మున్సిపాలిటీ ఎంపికైంది. సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు, జిల్లా అదనపు కలెక్టర్ మొజామ్మిల్ ఖాన్ ఉత్తమ సానిటేషన్ అవార్డ్, సర్టిఫికేట్ లనురాష్ట్ర మంత్రులు కెటిఆర్, పువ్వడా అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. లక్ష పైచిలుకు జనాభా కలిగిన పట్టణాలలో భాగంగా ఈ అవార్డును సిద్దిపేట మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు గారు మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణానికి ఉత్తమ సానిటేషన్ అవార్డు రావడం చాలా ఆనందకరమైన విషయమని, సిద్దిపేట పట్టణాన్ని అభివృద్ధిలో, అన్నిరంగాలలో రాష్ట్రంలో ఎప్పుడు ప్రథమ స్థానంలో నిలుపుటకు అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డు సాధించడంలో కృషి చేసిన సిద్దిపేట మున్సిపల్ పాలవర్గానికి, అధికారులకు, సిబ్బందికి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పురపాలక శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు,సిద్దిపేట పురపాలక సంఘం ఎఇ రంజిత్,రాష్ట్రంలోని మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు,అధికారులు తదితరులు పాల్గొన్నారు