Monday, December 23, 2024

సిద్దిపేటను విద్య వైద్య క్షేత్రంగా మారుస్తాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

సిద్దిపేట: సిద్దిపేటను విద్య వైద్య క్షేత్రంగా మారుస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ శివారులో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్మించనున్న శ్రీ రంగనాయక స్వామి బీ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపిపి మాణిక్ రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో వైద్య విద్యలో మొత్తం1350 మంది ఎంబిబిఎస్ విద్యార్థులు ఉన్నారని, సిద్దిపేటలో ఎల్అండ్ టి సంస్థతో 500 మందికి శిక్షణ, ఉపాధి కల్పిస్తామన్నారు. సిద్దిపేటలో బి ఫార్మసీ కళాశాల రావడం చాలా ఆనందంగా ఉందని, సిద్దిపేట రంగనాయక సాగర్ లక్ష ఏకరాలు సాగు నీరు అందిస్తుందని ప్రశంసించారు. మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నీక్, మెడికల్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, పిజి కళాశాల, నర్సింగ్ కళాశాల, బివిఎస్ఇ వెటర్నటీ కళాశాల, ప్రభుత్వ గురుకుల పాఠశాల, వారు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోచింగ్ సెంటర్ తీసుకవస్తున్నామని, సెట్విన్ ట్రైనింగ్ సెంటర్, ఆంధ్రా బ్యాంకు ఆధ్వర్యంలో ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

ఇప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులకు విద్య అందిస్తున్నామని, వేలాది, లక్షలాది మంది గ్రామీణ విద్యార్థులకు, బాలికలకు విద్యను అందిస్తున్నామని, ఇది చాలా గొప్ప విషయమన్నారు. ఎగ్జిబిషన్ లద్వారా వచ్చే ఆదాయంతో ఈ విద్యా సేవ చేస్తున్నామని, సిద్దిపేటలో 26 కోట్ల రూపాయలతో బి ఫార్మసీ కళాశాల నిర్మిస్తున్నామని, ఒక్క కేసు లేకుండా రంగ నాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించామని, భవిష్యత్ లో ప్రభుత్వంతో మాట్లాడి ఒక యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామని హరీష్ రావు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని, ఇది ఈ ప్రాంత విద్యార్థులకు ఒక వరం లాంటి కళాశాల అని చెప్పారు. భవిష్యత్ లో ఈ ప్రాంత విద్యార్థులకు అవసరమైన, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను ఏర్పాటు చేస్తామన్నారు. కళాశాల భవన నిర్మాణానికి, ఎగ్జిబిషన్ సొసైటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News