- Advertisement -
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త జోనర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ అందరికీ విషెష్ తెలియజేస్తూ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో స్టార్ బాయ్ సిద్ధు సింపుల్‌గానే కనిపిస్తున్నా స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.
- Advertisement -