Saturday, April 5, 2025

అంచనాలు పెంచేసిన జాక్ ట్రైలర్…

- Advertisement -
- Advertisement -

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్‌’. కొంచెం క్రాక్‌ అనేది ట్యాగ్‌లైన్‌. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బేబి సినిమా ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంది. సిద్ధూ డైలాగ్స్, కామెడి టైమింగ్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. సిద్దూ నటించిన టిల్లు, టిల్లు స్క్వేర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఏప్రిల్‌ 10న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News