Wednesday, January 22, 2025

ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు ‘టిల్లు స్క్వేర్‌’

- Advertisement -
కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘డీజే టిల్లు’లో టిల్లు వంటి గొప్ప వినోదాత్మక పాత్రతో స్టార్‌బాయ్ సిద్ధు అలరించారు. సిద్ధుని టిల్లు పాత్రలో మరోసారి చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు.
వారు రెట్టింపు వినోదం మరియు మస్తీతో ‘డీజే టిల్లు’ సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్‌’ ప్రకటించారు. ఎందరో ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకుని, ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున, మేకర్స్ హడావిడి చేయకుండా, ఒరిజినల్ కి ఏమాత్రం తగ్గకుండా పూర్తి వినోదాత్మకంగా మలచడానికి తమ సమయాన్ని వెచ్చిస్తున్నారు.
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, టిల్లూ స్క్వేర్ కల్ట్ స్టేటస్‌ను అందుకుంటుందని, ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.
టిల్ స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. డీజే టిల్లులో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర తరహాలో ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అనుపమ కనిపిస్తున్న తీరు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన టికెటే కొనకుండా అనే పాటను మేకర్స్ విడుదల చేయగా భారీ హిట్ అయ్యింది. టిల్లు స్క్వేర్ ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇది ఒరిజినల్ లాగానే మరోసారి ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.
నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మల్లిక్ రామ్ టిల్ స్క్వేర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News