చలికాలంలో ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. అప్పుడప్పుడే ఏదైనా ఫ్రెష్, స్వచ్ఛమైన పచ్చి కూరగాయలు చేసుకోవాలనిపిస్తుంది. ఈ సీజన్‌లో దొరికే ప్రతి రకమైన కూరగాయలు రుచికరమైనవి, పోషకమైనవి. రుచిగా ఉన్నాయని వాటిని అధికంగా తీసుకుంటే అవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఏదైనా ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇందులో భాగంగానే పచ్చి బఠానీలు చలికాలంలో విపరీతంగా దొరికే కూరగాయ. బఠానీలలో ఉండే పోషక గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ బఠానీలను ఎక్కువగా తినడం మన ఆరోగ్యానికి కూడా హానికరం అని మీకు తెలుసా?
బఠానీలు తీసుకుంటే కలిగే నష్టాలు
1. పచ్చి బఠానీలు అధిక పీచు ఉండే కూరగాయ. కావున ఎవరైనా దీనిని అతిగా తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.
2. ఇందులో లెక్టిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇకవేళ దీనిని అధికంగా తీసుకుంటే.. అది జీర్ణవ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వీటిని అధికంగా తీసుకుంటే కడుపు నొప్పి, మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
3. ఈ పచ్చి బఠానీలో అధిక మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది. కావున ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు, కీళ్లనొప్పులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.
4. చలికాలంలో బఠానీలను అధికంగా తీసుకుంటే, అది శరీరంలో అదనపు కేలరీలు, కార్బోహైడ్రేట్లకు దారితీస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
5. బఠానీలో కొన్ని ఔషధాలతో ప్రతికూలంగా స్పందించగల కొన్ని మూలకాలను కూడా కలిగి ఉంటాయి. అందువల్ల ఏదైనా ఔషధం తీసుకుంటే, బఠానీల వినియోగాన్ని పరిమితం చేయండి లేదా వైద్యుడిని సంప్రదించండి.