మనం తరచుగా తీసుకునే ఆహారంలో ఎన్నో ఆహార పదార్థాలు ఉంటాయి. అందులో భాగంగానే గోధుమలను మన ఆహారంలో ఏదో విధంగా చేర్చుకుంటాము. ఏదైనా ఆహారాన్ని అధికంగా తీసుకుంటే అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ క్రమంలోనే గోధుమను మన ఆహారంలో ఎక్కువ చేర్చుకుంటే మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. గత కొన్ని రోజులుగా గోధుమలు ఎక్కువగా తీసుకుంటే అది అలర్జీగా ఐతుంది. ఇందులో గ్లూటెన్ ఉంటుంది. అందుకే ఇది చాలా ఆందోళన కలిగిస్తోంది. ఎలర్జీ జీర్ణక్రియ, చర్మ సమస్యలపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే గోధుమలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో మనం ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.
గోధుమలను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. నిజానికి గోధుమలలో అధిక ఫైబర్ ఉంటుంది. ఒకవేళ దీన్ని అధికంగా తీసుకుంటే.. అది జీర్ణ వ్యవస్థపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీరు గోధుమలతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకుంటే ఇలాంటి సమస్య ఎదురైతే మీకు అలర్జీ ఉండొచ్చు. అంతేకాకుండా.. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల స్కిన్ అలర్జీ ప్రమాదాన్ని పెంచుతుంది. గోధుమలతో తయారుచేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే చర్మంపై దురద, ఎర్రటి దురదలు వంటి సమస్యలు వస్తాయి.
గోధుమలు అధికంగా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. దీన్ని అలర్జీ వల్ల ముక్కు మూసుకుపోవడం, తుమ్ములు, గురక వంటి సమస్యలు వస్తాయి. చాలాసార్లు గోధుమపిండిని చపాతి గా చేసినప్పుడు ముక్కు ద్వారా గాలితో శరీరం లోపలికి చేరుతుంది. ఒత్తిడి, అనేక నిద్ర సమస్యలతో బాధపడుతుంటే దీనికి గోధుమలు కారణం కావచ్చు. కొందరు గోధుమలను తిన్న తర్వాత తరచుగా తలనొప్పి లేదా మైగ్రేన్ తో బాధపడుతుంటారు. ఇది గోధుమల అలర్జీ ఉండడానికి కూడా సంకేతమని చెప్పవచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు గోధుమలను అధికంగా తీసుకోవడం వల్ల న్యూరో సమస్యలు కూడా ఎదురవుతాయి.