Monday, December 23, 2024

కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ నిజమే: ఒప్పుకున్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కోట్లాదిమంది భారతీయులకు గడచిన రెండు సంవత్సరాలుగా అందచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ల వల్ల ఎన్నో దుష్ప్రభావాలు(సైడ్ ఎఫెక్ట్) ఏర్పడినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండు ప్రముఖ సంస్థలు అంగీకరించాయి. పుణెకు చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్ శారద సమాచార హక్కు చట్టం(ఆర్‌టిఐ) కింద అడిగన ప్రశ్నకు భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్), సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్(సిడిఎస్‌సిఓ) ఇచ్చిన సమాధానాలతో అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతించిన వ్యాక్సిన్లలో పుణెకు చెందిన సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్, కోవోవ్యాక్స్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కోవ్యాక్సిన్, రెడ్డీస్ ల్యాబ్ దిగుమతి చేసకున్న స్పుత్నిక్ వి, బయోలాజికల్ ఇ లిమిటెడ్‌కు చెందిన కోర్‌బిఇవ్యాక్స్, క్యాడిలా హెల్త్‌కేర్ లిమిటెడ్‌కు చెందిన జైకోవ్ డి(12-17 వయస్సు వారికి మాత్రమే)తోపాటు ఆస్ట్రాజెనకా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి శారద లేవనెత్తిన సందేహాలకు ఐసిఎంఆర్ పిఐఓ డాక్టర్ లేయన్న సుసాన్ జార్జ్, సిడిఎస్‌సిఓ పిఐఓ సుశాం సర్కార్ సవివరంగా సమాధానమిచ్చారు.

సైడ్ ఎఫెక్ట్ విషయంలో కోవిషీల్డ్ అగ్రస్థానంలో ఉన్నట్లు వీరు ఇచ్చిన సమాధానం ద్వారా తెలుస్తోంది. శరీరంపై ఇంజక్షన్ ఇచ్చిన చోట నొప్పి లేదా వాపు, ఎర్రని దద్దుర్లు రావడం, అకారణంగా వాంతులు కావడం, తీవ్రంగా లేదా తరచు కడుపులో నొప్పి లేదా తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం, ఛాతీ నొప్పి, చేతులు సత్తువ కోల్పోవడం, చేతుల్లో వాపులు, శరీరంలో కొన్ని భాగాలు పక్షవాతానికి గురికావడం, శరీరం బిగుసుకుపోవడం, కళ్లలో మంగలు, చూపు మందగించడం, మానసిక స్థితిలో మార్పులు, మానసిక కుంగుబాటుకు లోనుకావడం వంటివి కోవిషీల్డ్ వల్ల ఏర్పడిన సైడ్ ఎఫెక్ట్ అని వారు తెలిపారు.

కోవోవ్యాక్స్ సైడ్ ఎఫెక్ట్‌లో ఇంజక్షన్ ఇచ్చిన చోట నొప్పి, వాపు కలగడం, నీరసం, తలనొప్పి, జ్వరం, కండరాల వాపు, కీళ్ల నొప్పులు, వాంతులు, చలి, వొంటి నొప్పులు, చేతుల్లో నొప్పి, సత్తువ కోల్పోవడం, వీపు నొప్పి, కళ్లు తిరిగినట్లు ఉండడం వంటివి. కోవ్యాక్సిన్ వల్ల ఏర్పడిన సైడ్ ఎఫెక్ట్‌లో ఇంజక్షన్ ఇచ్చిన చోట నొప్పి లేదా వాపు, తలనొప్పి, అలసట, జ్వరం, వొళ్లు నొప్పులు, కడుపులో నొప్పి, వికారం, వాంతులు, కళ్లు తిరగడం, శరీరం వణకడం, చెమట పట్టడం, జలుబు, దగ్గు వంటివి. స్పుత్నిక్ వి వల్ల ఏర్పడిన సైడ్ ఎఫెక్ట్‌లో చలి, వరం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, అజీర్తి, గొంతువాపు మొదలైనవి. కోర్‌బివ్యాక్స్ వల్ల సైడ్‌ఎఫెక్ట్‌లో ఇంజక్షన్ ఇచ్చిన చోట నొప్పి, వాపుతోపాటు జ్వరం, తలనొప్పి, అలసటి, వొళ్లు నొప్పులు, అజీర్తి, చలి, నీరసం వంటివి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News