Wednesday, January 22, 2025

పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

Moosewala last rites

మూసా(మాన్సా): ఆదివారం గ్యాంగ్‌స్టర్ వార్‌లో గుర్తు తెలియని హంతకుల చేతిలో హతమైన ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు శుభ్‌దీప్ సింగ్ (సిద్ధూ మూసేవాలా) అంత్యక్రియలు మంగళవారం అతడి స్వగామంలోని పొలంలో జరిగాయి. ఈ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున జనం వచ్చారు. అతడి కుటుంబ సభ్యులు అతడి అంత్యక్రియలను మూసా గ్రామంలోని అతడి పూర్వికుల వ్యవసాయ భూమిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఆ గాయకుడి మృత దేహానికి అటాప్సీ చేసినప్పుడు 25 బుల్లెట్ గాయాలు వెలుగుచూశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News