Thursday, December 26, 2024

సిధ్ధూ ముసేవాలా చివరి పాట యూట్యూబ్ నుంచి తొలగింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సింగర్, ర్యాపర్, పాటల రచయిత సిద్ధూ మూసేవాలా హత్యానంతరం విడుదలైన ఎస్‌వైఎల్ (సట్లజ్‌యమునా అనుసంధానం) పాటను వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తొలగించింది. పంజాబ్ నీళ్ల సమస్య, సట్లెజ్ యమునా నదుల అనుసంధాన కాలువ ఇతివృత్తంగా ఈ పాట సాగింది. ఈ కాలువ విషయంలో ఇప్పటికీ హర్యానా, పంజాబ్ ప్రభుత్వాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదరని ఈ అంశమే కాకుండా, అవిభజిత పంజాబ్, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన వాక్యాలూ ఈ పాటలో ఉన్నాయి. మరోవైపు రైతు ఆందోళన సమయంలో ఎర్రకోటపై సిక్కు జెండా ఎగురవేత దృశ్యాలను కూడా వీడియోలో వాడారు. దీంతో ప్రభుత్వం నుంచి న్యాయపరమైన ఫిర్యాదులు రావడంతో ఈ కంటెంట్‌ను తొలగించినట్టు యూట్యూబ్ పేర్కొంది. జూన్ 23 శుక్రవారం ఈ వీడియో విడుదలైంది. ఎస్‌వైఎల్ పాట విడుదలైన నాటి నుంచి యూట్యూబ్‌లో 27 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Sidhu Moose Wala last song removed from Youtube

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News