Wednesday, January 22, 2025

అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -
- Advertisement -

Sidhu Moose Wala Murder Suspect Encounter

అమృత్‌సర్‌: పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లో ఎన్ కౌంటర్ జరిగింది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న పంజాబ్ పోలీసులకు, ఇద్దరు గ్యాంగ్‌స్టర్లకు మధ్య బుధవారం కాల్పులు జరిగినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు కాగా, ఓ గ్యాంగ్ స్టర్ మృతిచెందాడు. ఆ ప్రాంతంలోని స్థానికులు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు కోరారు. పంజాబ్ పోలీస్‌కి చెందిన యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ భక్నా గ్రామంలో ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఏకే 47 ఉపయోగించి సిద్ధూ మూస్ వాలాపై కాల్పులు జరిపిన మొదటి వ్యక్తి మన్‌ప్రీత్ అని గుర్తించారు. మూస్ వాలా మే 29న అతని ఇంటికి సమీపంలోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో కాల్చి చంపబడిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News