Monday, December 23, 2024

సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం…

- Advertisement -
- Advertisement -

Sidhu Moose Wala's murder revenge

తెరపైకి మరో గ్యాంగ్‌స్టర్

చండీగఢ్ : ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో పంజాబ్‌లో మరోసారి ముఠా కక్షలు తెరపైకి వచ్చాయి. సిద్ధూ హత్య తన పనేనని గోల్డీబ్రార్ అనే గ్యాంగ్‌స్టర్ ఫేస్‌బుక్‌లో పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ తాజాగా మరో గ్యాంగ్‌స్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. గ్యాంగ్‌స్టర్ నీరజ్ బావ్నాకు సంబంధించిన ఓ సోషల్ మీడియా ఖాతాలో మంగళవారం ఓ పోస్ట్ కనిపించింది. సిద్ధూ నా సోదరుడి లాండి వాడు. అతడి హత్యకు రెండు రోజుల్లో బదులు చెబుతాం అని హెచ్చరిస్తూ ఆ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్‌ను ఎవరు పెట్టారన్నది స్పష్టత లేదు. పలు హత్యలు, దోపిడీ కేసులను ఎదుర్కొంటున్న నీరజ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌ల్లో అతడికి అనుచరులున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం నీరజ్ బావ్నా ముఠా సభ్యుడైన భుప్పీరానా ఫేస్‌బుక్ ఖాతాలోనూ ఇలాంటి హెచ్చరికలే కనిపించాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News