Monday, January 20, 2025

సిద్ధూ హత్యకు పాతకక్షలే కారణం….

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ మూస్ వాలా ఆదివారం మాన్సా సమీపంలో కాల్చివేతకు గురయ్యాడు. జవహర్ కే గ్రామంలోని ఒక దేవాలయం సమీపంలో అతనిపై  కనీసం 10 సార్లు కాల్పులు జరుగగా మరణించాడు. కాంగ్రెస్ నేత సిద్ధూ హత్యకు పాతకక్షలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ నంబర్ ఫ్లేట్లు మార్చుకుంటూ సిద్ధూను నిందితులు ఫాలో అయ్యారు. బొలెరో వాహనం, ఫేక్ నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధూ హత్యకు తమదే బాధ్యత అని పంజాబీ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించారు. గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ ప్రస్తుతం కెనడాలో తలదాచుకుంటున్నాడు. తన సోదరుడు విక్కీ మర్డర్‌కు ప్రతీకారంగానే సిద్ధూను హత్య చేసినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News