Sunday, November 24, 2024

ESCAP ఇన్‌క్లూజివ్ బిజినెస్ ప్రోగ్రామ్‌లో చేరిన సిద్స్ ఫార్మ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తెలంగాణకు చెందిన ప్రీమియం డెయిరీ బ్రాండ్ అయిన సిద్స్ ఫార్మ్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (ESCAP) యొక్క ప్రతిష్టాత్మకమైన ఇన్‌క్లూజివ్ బిజినెస్ ప్రోగ్రామ్‌లో పాల్గొనటానికి ఎంపికైనట్లు ప్రకటించింది. Ecociate, Endeva (కోచ్), సిద్స్ ఫార్మ్ (Coachee) మధ్య అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయడంతో ఈ మైలురాయి చేరుకుంది.

ఇన్‌క్లూజివ్ బిజినెస్ ప్రోగ్రామ్ కింద, సిద్స్ ఫార్మ్ “చిన్న కమతాల డెయిరీ రైతుల పాల ఉత్పాదకతను వార్షికంగా 1.2 రెట్లు మెరుగుపరచడం” పేరుతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ ఆర్థిక సాధ్యతను నిర్ధారిస్తూ, ఆర్థిక పిరమిడ్ చివర వున్న చిన్న కమతాల రైతులు, వ్యక్తుల కోసం అర్ధవంతమైన సామాజిక ప్రభావాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎకోసియేట్ వద్ద సస్టైనబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ సంతోష్ గుప్తా మాట్లాడుతూ..“ సిద్స్ ఫార్మ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నాము. సమ్మిళిత వ్యాపారం పట్ల వారి నిబద్ధత మా సహకారంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. కలిసికట్టుగా మనం భారతదేశంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతుల రంగంలో శాశ్వతమైన మార్పులను తీసుకురాగలము” అని అన్నారు.

సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిషోర్ ఇందుకూరి మాట్లాడుతూ “ఈ అవకాశం లభించడం మాకు ఒక గౌరవం. నిరంతరం పెరుగుతున్న మా రైతుల నెట్‌వర్క్‌లో నైతిక, స్థిరమైన పాడి వ్యవసాయ పద్ధతులను రూపొందించడానికి మేము సంవత్సరాలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన ESCAP ప్రోగ్రామ్‌కు ఎంపికైన కొద్దిమందిలో ఉండటం సంతోషంగా వుంది” అని అన్నారు.

ఈ కార్యక్రమం 500 మంది చిన్న తరహా ఉత్పత్తిదారులను లక్ష్యంగా చేసుకుంటుంది, 300 మంది మహిళా చిన్నకారు పాడి రైతులతో వ్యవసాయంలో మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఈ రైతులలో పాల ఉత్పాదకతలో 20% పెరుగుదలను సాధించాలని సిద్స్ ఫామ్ లక్ష్యంగా పెట్టుకుంది, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 2,200 మంది వ్యక్తుల నెట్‌వర్క్‌కు ప్రయోజనం చేకూరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News