హైదరాబాద్: తెలంగాణ కేంద్రంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రీమియం డైరెక్ట్ టు కన్స్యూమర్ (డీ2సీ) డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ నేడు తమ మజ్జిగ (బటర్‌మిల్క్)ను పూర్తి సౌకర్యవంతమైన ప్యాకేజింగ్‌లో రాబోతున్న వేసవి సీజన్ కోసం విడుదల చేసింది. రీసైక్లిబల్ 200 మిల్లీ లీటర్ల ఫుడ్ గ్రేడ్ డిస్పోజల్ కప్పులలో ప్యాక్ చేసిన ఈ మజ్జిగను అత్యంత ఆకర్షణీయంగా 20 రూపాయల ధరలో రిటైలర్ల వద్ద అందిస్తున్నారు. అన్ని వర్గాల వారికీ ఇది అత్యంత అందుబాటు ధరలో ఉండటంతో పాటుగా అన్ని వయసుల వారికీ ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ఈ మజ్జిగ ఇప్పుడు తక్షణమే హోమ్ డెలివరీ కోసం కూడా అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో ఈ రోజు బుక్ చేసుకుంటే, ఆ తరువాత రోజు సిద్స్ ఫార్మ్ డీ2సీ ఛానెల్ ద్వారా డెలివరీ చేస్తారు. బెంగళూరులో ఇది నిర్ధేశిత ఈ–కామర్స్ మార్గాలలో లభ్యమవుతుంది.
సిద్స్ ఫార్మ్ ఫౌండర్ డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ.. ‘‘మిగిలిన సంస్థలకు భిన్నంగా మా మజ్జిగను నిలిపే అంశం సహజత్వం. మా పెరుగు, సహజసిద్ధమైన పదార్ధాలతో దీనిని తయారుచేశాము. సమ్మర్ కూలర్‌గా ఒకరు ఎంచుకునేందుకు ఆరోగ్యవంతమైన ఎంపిక ఇది. సౌకర్యవంతమైన, రీసైక్లిబల్ ప్యాకేజింగ్‌తో, మేము మా యువ వినియోగదారులు సైతం సంప్రదాయ వేసవి పానీయం తాగగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.