Wednesday, January 22, 2025

హైదరాబాద్‌, బెంగళూరులలో ప్యాకేజ్డ్‌ స్వీట్‌ లస్సీ విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డీ2సీ డెయిరీ బ్రాండ్‌, సిద్స్‌ ఫార్మ్‌ నేడు తమ నూతన ఉత్పత్తి, స్వీట్‌ లస్సీని విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్వీట్‌ లస్సీను 200 మిల్లీ లీటర్ల రీసైక్లిబల్‌ ఫుడ్‌ గ్రేడ్‌ డిస్పోజబల్‌ కప్‌లలో ప్యాక్‌ చేశారు. దీనిని అత్యంత ఆకర్షణీయంగా 30 రూపాయల ధరలో అందిస్తున్నారు.

ఈ స్వీట్‌ లస్సీ తక్షణమే హైదరాబాద్‌లో లభ్యమవుతుంది. ఇక్కడ డైరెక్ట్‌ టు కన్స్యూమర్‌ ఛానెల్‌ ద్వారా హోమ్‌ డెలివరీ చేయనున్నారు. త్వరలోనే ఈ స్వీట్‌ లస్సీ బెంగళూరులో లభ్యం కానుంది. అక్కడ అతి సులభంగా పొందగల ఈ–కామర్స్‌ , యాగ్రిగేటర్‌ ఛానెల్స్‌లో లభ్యం కానుంది.

ఈ నూతన ఉత్పత్తి గురించి సిద్స్‌ ఫార్మ్‌, ఫౌండర్‌ శ్రీ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ.. ‘‘ఈ వేసవిలో ఎండలు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఈ ఇండియన్‌ బేవరేజ్‌ను పరిచయం చేయడానికి ఇది సరైన సమయమని భావిస్తున్నాము. మరీ ముఖ్యంగా ఆరోగ్య పరంగా కూడా లస్సీ మేలైనది. ప్రతి కుటుంబానికీ ఆరోగ్యం అందించాలన్నది మా ప్రయత్నం. సహజసిద్ధమైన డెయిరీ ఉత్పత్తులను యాంటీబయాటిక్స్‌, హార్మోన్లు, నిల్వకారకాలు, ఇతర ప్రమాదకరమైన రసాయనలేవీ కలపకుండా తయారు చేశాము. ప్రతి ఒక్కరూ ఈ స్వీట్‌ లస్సీని ఆస్వాదించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను’’అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News