Wednesday, January 22, 2025

అగ్రి స్టార్టప్స్‌ అవార్డును సిద్స్‌ ఫార్మ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న డీ2సీ డెయిరీ బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌ ను తెలంగాణలో అత్యుత్తమ అగ్రి స్టార్టప్‌గా గుర్తించి, గౌరవించారు.ఈ గౌరవాన్ని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌)తో కలిసి చిన్నకారు రైతుల కోసం భారతదేశపు అగ్రగామి ఓపెన్‌ అగ్రి నెట్‌వర్క్‌, సమున్నతి నిర్వహించిన అవార్డుల వేదికపై అందించారు. సిద్స్‌ ఫార్మ్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి ఈ అవార్డును భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే చేతుల మీదుగా అందుకున్నారు.

సాంకేతిక ఆవిష్కరణల ద్వారా రైతులకు మద్దతు అందించడంతో పాటుగా వ్యవసాయ అభివృద్ధి వాతావరణ వ్యవస్ధను పునర్నిర్మాణానికి అంకితమైన అగ్రిటెక్‌ స్టార్టప్స్‌ను గుర్తించేందుకు మేనేజ్‌–సమున్నతి అగ్రి స్టార్టప్‌ అవార్డులను అందిస్తున్నారు. ఈ అవార్డు ఎంపికలో అత్యంత కీలకాంశంగా ప్రభావం సృష్టించడం, రైతులతో భాగస్వామ్యం, మరియు పరిష్కారానికి సంబంధించి కంపెనీ సాధించిన పురోగతికి అదనంగా నామినేట్‌ చేయబడిన స్టార్టప్‌ ద్వారా పరిష్కరించబడిన సమస్యల తీవ్రతను పరిగణలోకి తీసుకుంటారు.

ఈ గౌరవాన్ని అందుకోవడం పట్ల సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ డాక్టర్‌ కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘ నాణ్యత, వినియోగదారుల లక్ష్యిత కార్యకలాపాలను నిర్వహించాలని సిద్స్‌ ఫార్మ్‌ వద్ద మేము లక్ష్యంగా చేసుకున్నాము. ప్రజల సంస్ధగా నిలపడంలో మాకు సహకరించిన మా రైతు భాగస్వాములు, మా సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ గౌరవం, ఆరోగ్యకరమైన, సురక్షితమైన మరియు నైతిక పోషణతో కూడిన భారతదేశాన్ని నిర్మించడంలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది’’ అని అన్నారు.

మేనేజ్‌ సమున్నతి అవార్డుల ద్వితీయ ఎడిషన్‌ ఇది. మొత్తంమ్మీద 32 అవార్డులు అందించగా, వీటిలో మూడు జాతీయ, 27 రాష్ట్ర స్ధాయి, రెండు మహిళా వ్యాపారవేత్తలకు కేటాయించారు. ఈ అవార్డుల వేడుకకు కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి సుశీ శోభా కరంద్లాజే హాజరుకాగా ఇతర ముఖ్యులలో సమున్నతి ఫౌండర్‌–సీఈఓ శ్రీ అనిల్‌ కుమార్‌ ఎస్‌జీ; మేనేజ్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర; మేనేజ్‌ డైరెక్టర్‌ (అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌) డాక్టర్‌ శరవణన్‌ రాజ్‌ పాల్గొన్నారు.

Sid’s Farm received Agri Start-up of Telangana Award

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News