Tuesday, April 15, 2025

తమిళంలో సంతకం చేయరేం?

- Advertisement -
- Advertisement -

ఇదేనా..మీ భాషాభిమానం?
ఎంబిబిఎస్ వంటి వైద్యవిద్య
కోర్సుల్లో తమిళ భాషను
ప్రవేశపెట్టి ప్రోత్సహించాలి
స్టాలిన్ సహా డిఎంకె నేతలపై
ప్రధాని నరేంద్ర మోడీ విసుర్లు

రామేశ్వరం: భాషా వివాదంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వైఖరిని ప్రధాని నరేంద్రమోదీ ఖండించారు. పంబన్ బ్రిడ్జి ని ప్రారంభించిన అనంతరం రామేశ్వరంలో భారీ సభలో ప్రధాని ప్రసంగించారు. తమిళ భాష, సంసృ్కతి, వారసత్వం ప్ర పంచంలోని ప్రతిమూలకు చేరేలా తమ ప్రభుత్వం నిరంతరంగా కృషిచేస్తోందనిమోదీ అన్నారు. తమిళ భాష పట్ల నాయకులకు చిన్న చూపును ఎద్దేవా చే స్తూ, కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖల్లో తమిళం లో సంతకం చేయరేం.. అని స్టాలిన్ కు చురకలు వే శారు. ఆ పార్టీ నాయకులు కూడా తమిళంలో సం తకం చేయరని పేర్కొన్నారు. మీకు తమిళం పట్ల ప్రే మ గౌరవం ఉంటే.. తమిళంలో సంతకం చేయండి అని స్టాలిన్ కు సూచించారు.

అలాగే పేద తమిళ ప్రజలు సులభంగా ఉన్నత విద్య అభ్యసించేలా.. తమిళంలో ఎంబిబిఎస్ వంటి వైద్య విద్యను ప్రవేశపెట్టి ప్రోత్సహించాలన్నారు. తమిళనాడులో కొత్తగా 11 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ కు కేంద్రానికి మధ్య కొద్ది కాలంగా హిందీ బలవంతంగా రుద్దుతున్నారనే ఆరోపణపై మాటలయుద్ధం సాగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నదని తమిళనాడు ఆరోపిస్తోంది. కొత్త విద్యావిధానం లో మూడు భాషల సూత్రం మరింత వివాదం అయింది. కేంద్రం ధోరణి వల్ల తమిళభాష, సంసృ్కతి కి విఘాతం కలుగుతుందని స్టాలిన్ ప్రభుత్వం విమర్శిస్తోంది. కొత్త విద్యా విధానంలో భాగంగా త్రిభాష సూత్రాన్ని అంగీకరించలేదన్న సాకుతో తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం విద్యాపరమైన రూ.2 వేల కోట్ల నిధులను నిలిపివేసిందని స్టాలిన్ సర్కార్ ఆరోపిస్తోంది.

పదేళ్లలో ఏడు రెట్లు పెరిగిన తమిళనాడు బడ్జెట్

తమిళనాడుకు కేటాయిస్తున్న నిధులను నిలిపివేస్తున్నామన్న ఆరోపణను ప్రధాని మోదీ ఖండించారు. గత దశాబ్దంగా తమిళనాడుకు కేంద్రం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, పదేళ్లలో తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ ఏడు రెట్లు పెరిగిందని ఆయన గుర్తు చేశారు. 2014వ సంవత్సరానికి ముందు ప్రతి సంవత్సరం తమిళనాడుకు రూ.900కోట్లు మాత్రమే కేటాయించేవారని, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6వేల కోట్లు దాటిందని చెప్పారు. రామేశ్వరం రైల్వే స్టేషన్ తో సహా 77 రైల్వే స్టేషన్లను ఎన్నో సౌకర్యాలతో ఆధునీకరిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఇన్ని చేసినా స్టాలిన్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తమిళనాడు సీఎం స్టాలిన్ పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. ఊ టీలో మరో కార్యక్రమంలో సీఎం ప్ర సంగిస్తూ, జనాభా నియంత్రణ అమలు చేస్తున్న తమిళనాడు, ఇతర రాష్ట్రాలకు మున్ముందు పార్లమెంటు సీట్ల విషయంలో అన్యాయం జరగదని గ్యారం టీ ఇవ్వాలని మోదీని డిమాండ్ చే శారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News