Friday, December 20, 2024

వైద్యరంగంలో గణనీయమైన పురోగతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక వైద్యరంగంలో గణనీయమైన పురోగతిని సాధించామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫ రాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా లో భాగంగా రేకుర్తి లోని శుభం గార్డెన్స్ లో నిర్వహించిన వైద్యారోగ్య దినోత్సవంలో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా పాల్గోని జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 21 రోజుల పాటు నిర్వహించుకుంటున్న దశాబ్ది ఉత్సవాలను భావితరగాలకు గుర్తుండిపోయోలా అద్బుతంగా నిర్వహించుకోవాలన్నారు. గతంలో ఆరకొ ర వైద్య సిబ్బందితో సకాలంలో కనీస వైద్యం కూడా అందేది కాదని, ఎప్పుడు సీజనల్, కలరా వంటి విషజ్వరాలే, ఎక్కడచూసిన అపరిశు భ్రమైన వాతావరణమే కనిపించేదని అన్నారు. 2010లో డెంగ్యూ వ్యాధితో బాదపడుతు మనకళ్లముందే ఎన్నో మరణాలు సంభవించా యన్నారు.

అనారోగాల సమస్య ఎక్కడ మొదలయింది, దానిని నిరోదించడం ఎలా అని కూడ ఎవరకు ఆలోచించలేదని అన్నారు. నా డు ఉన్నత వర్గాలకు మాత్రమే సాద్యమయ్యే వైద్య విద్యను, నేడు సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావం జరిగిందని. వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థుల కలను నేరవెరస్తూ తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఒక్క వైద్యకళాశాలను ఎర్పాటు చేయడం జ రిగిందన్నారు.

ఒకప్పుడు ఎదైన రోగం వస్తే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులుండేవని, వైద్యరంగంలో అనేక మార్పు లు, ఎన్నో సంస్కరణలను తీసుకురావడంతో ప్రభుత్వ ఆసుపత్రలో సాధారణ ప్రసవాలు పెరిగాయని. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లుల కోరకు ఆస్థులు ఆమ్ముకునే స్థితి గతంలో ఉండేదని, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్న వైద్యం పై, కేసీర్ కిట్ లతో ప్రజల్లో నమ్మకం పెరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణలోనే ప్రప్రథమంగాల్యాక్టిషియన్ సెంటర్ ను ప్రారంభించుకోవడం జరిగిందని, అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని అంటారు. కాని అలా పాలు పట్టించలేని స్థితిలో ఉన్న బాలింతల కోరకు ఈ కేంద్రాన్ని ప్రభుత్వ ప్రదాన ఆసుపత్రిలో ప్రారంబించుకోవడం జరుగుతుందన్నారు.

2020లోయావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోన, కరీంనగర్ లో ఒక్కసారే 10 కరోనా కేసులు రావడంతొ భయబ్రాంతులకు గురయ్యామని, అలాంటి పరీస్థితిలో పోలీస్, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది విలువైన ప్రాణాలను కాపాడారని, అనునిత్యం వైద్య సిబ్బంది అందుబాటు ఉండి అద్బుతమైన వైద్య సేవలను అందించి కరోనాపై విజయం సాధించారన్నా రు. ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైన వైద్య సిబ్బంది తమ కుంటుంబాలను వదిలి ప్రజల కొరకు కృషిచేసిన ఆశా, ఎఎన్‌ఎం, డాక్టర్లు ఇతర వైద్య సిబ్బందికి ఈ సందర్బంగా కృతజ్ఞతలను తెలుపుతున్నామన్నారు.

ఈ సందర్భంగా పలువురు గర్భిణుల కు న్యూట్రిషన్ కిట్లను అందించారు. అనంతరం చీర, బీపి పరీక్షా పరికరాన్ని, మెరుగైన సేవలను అందించిన వైద్య సిబ్బందిని శాలువా, మెమోంటోతో సత్కరించి ఇద్దరికి కంటివెలుగు కళ్లాద్దాలను అందజేశారు. అనంతరం వైద్యసిబ్బందితో కలిసి బోజనం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, మెయర్ వై. సనీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మదు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనీల్, కొత్తపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, జిల్లా వైద్యాధికారి కె. లలితా దేవి, జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఎల్. కృష్ణ ప్రసాద్, ఎంపీపీ టీ లక్ష్మయ్య, జెడ్పిటిసిలు, కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు,వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News