Saturday, January 11, 2025

వైద్య రంగంలో గణనీయమైన పురోగతి

- Advertisement -
- Advertisement -

నిర్మల్ : రాష్ట్ర ఆవరణ దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఎంసీహెచ్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్సవంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ,న్యాయ,దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు, ఆశా వర్కర్లు, వైద్య బృందాలకు ప్రొఫెసర్లకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రూ. 23.75 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడ్డ్డ నిర్మల్ జిల్లా వైద్య రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్షంతో సర్కార్ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇప్పటికే గ్రామీణం నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ వైద్య శాలలను అభివృద్ధ్ది చేసిందని చెప్పారు.

అత్యాధునిక పరికాలను అందుబాటులోకి తేవడంతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలకు కూడా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తేవడంతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో పీహెచ్‌లో ఇప్పుడున్న 50 పడకలకు రూ. 50 లక్షల వ్యయంతో మరో 30 పడకలతో దీన్ని 80 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రితో పాటు ఇతర దవాఖానాల్లో మొత్తం 450 పడకలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News