Thursday, January 23, 2025

సింహాచలం ఘాట్‌రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్….

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: సింహాచలం ఘాట్‌రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొండ దిగువన కూడా కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎండలో గంటలు తరబడి వాహనాలు నిలిచిపోయాయి. కొండమీదకు ఎప్పుడు అనుమతి ఇస్తారో చెప్పలేకపోవడంతో అప్పన్న భక్తులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడంతో కూడా విఫలమయ్యారు. డ్యూటీలో ఉన్న పోలీసులతో భక్తులు తీవ్ర వాగ్వాదం చేశారు. అప్పన్న భక్తులు కొండపైకి ఎండలో నడిచి వెళ్తున్నారు.

అప్పన్న చందనోత్సవంలో మంత్రులకు భక్తుల నుంచి నిరసన సెగ తగిలింది. మంత్రులు కొట్టు సత్యనారాయణ,బోత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రులు గో బ్యాక్ అంటూ క్యూలైన్‌లో భక్తులు నినాదాలు చేశారు. చందనోత్సవం ఏర్పాట్లలో ఇప్పుడు వరకు ఎప్పడూ ఇంత అలసత్వం చూడలేదని మండిపడ్డారు. దేవస్థానం సిబ్బంది, పోలీసుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. రూ.1500 టికెట్ తీసుకున్నా క్యూలైన్లు కదలట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి స్వరూనందేంద్రకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు.

Also Read: బస్సులో వెళ్తున్న యువకుడిపై లైంగిక దాడి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News