Sunday, December 22, 2024

సైమాలో నాని సినిమాల హవా

- Advertisement -
- Advertisement -

ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్‌కు అవార్డులు
ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’
ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) -2024 వేడుకలు దుబాయి వేదికగా ఘనంగా జరిగా యి. ఈ వేడుకలలో దక్షిణాదికి చెందిన అతిరథ మహారథులు హాజరై సందడి చేశారు. హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, నిర్మాతలు అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ఈ అవార్డ్స్ వేడుకలో నేచురల్ స్టార్ నాని సినిమాల హవా కొనసాగింది. దసరా, హాయ్ నాన్న చిత్రాలు అవార్డులు కొల్లగొట్టాయి. 2024 సంవత్సరానికి గా నూ ‘దసరా’ మూవీలో నటనకు ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ చిత్రం గా గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ బ్యానర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ నిలిచి అవార్డును చేజిక్కించుకుంది.

సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అందుకున్నారు. ‘బేబీ’ చిత్రం నాలుగు అవార్డులని సొంతం చేసుకుంది. ఉత్తమ నటు డు (క్రిటిక్స్)గా ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ గా సాయి రాజేష్ , ఉత్తమ డెబ్యు నటిగా వైష్ణవి చైతన్య, ఉత్తమ లిరిక్స్ రైటర్‌గా అనంత శ్రీరామ్ బేబీ చిత్రానికిగాను అవార్డులు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడు పాపులర్‌గా శ్రీకాంత్ ఓదెల (దసరా), ఉత్తమ నటి క్రిటిక్స్‌గా మృణాల్ ఠాకూర్ (హాయ్ నా న్నా), బెస్ట్ డెబ్యు డైరెక్టర్‌గా శౌర్యువ్ (హాయ్ నాన్న), ఉత్తమ డె బ్యు ప్రొడ్యూసర్స్‌గా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, విజయేందర్ రెడ్డి తీగల (హాయ్ నాన్న), ఉత్తమ సంగీత దర్శకుడిగా హేషామ్ అ బ్దుల్ వహాబ్ (హాయ్ నాన్న), ఎమర్జింగ్ యాక్టర్‌గా సుమంత్ ప్ర భాస్ (మేమ్ ఫేమస్) అవార్డులు అందుకున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ వేడుకలో ఎంతోమంది హీరో, హీరోయిన్స్ తమ స్పెషల్ పెర్ఫార్మెన్స్ లతో కనువిందు చేశారు. సైమా చైర్‌పర్సన్స్ విష్ణు వర్ధన్ ఇందూరి, బృందా ప్రసాద్ అడుసుమిల్లి మాట్లాడుతూ..’సౌత్ ఇండియన్ సినిమాలోని ది బెస్ట్‌ని సెలబ్రేట్ చేసుకోవడం ఎంతోఆనందం వుంది. ఈవెంట్‌ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన సెలబ్రిటీస్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ తెలిపారు.
‘సైమా’ 2024 అవార్డ్స్ విన్నర్లు
ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
ఉత్తమ నటుడు పాపులర్ : నాని (దసరా)
ప్రముఖ ఉత్తమ నటి పాపులర్ .: కీర్తి సురేష్ (దసరా)
ఉత్తమ నటి క్రిటిక్స్ : మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్నా)
ఉత్తమ దర్శకుడు పాపులర్ : శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ నటుడు క్రిటిక్స్: ఆనంద్ దేవరకొండ(బేబీ)
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: సందీప్ రెడ్డి వంగా
ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్ : సాయి రాజేష్ (బేబీ)
ఉత్తమ హాస్యనటుడు: విష్ణు(మ్యాడ్)
ఉత్తమ ప్రతినాయకుడు : దునియా విజయ్ (వీర సింహారెడ్డి )
ఉత్తమ సహాయ నటి: బేబీ కియారా (హాయ్ నాన్న)
ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
బెస్ట్ డెబ్యు డైరెక్టర్: శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ డెబ్యు ప్రొడ్యూసర్స్ : వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, విజయేందర్ రెడ్డి తీగల (హాయ్ నాన్న)
ఎమర్జింగ్ యాక్టర్ : సుమంత్ ప్రభాస్
ఉత్తమ డెబ్యు నటి: వైష్ణవి చైతన్య ( బేబీ )
ఉత్తమ డెబ్యు నటుడు : సంగీత్ శోభన్ (మ్యాడ్ )
ఉత్తమ సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ (హాయ్‌నాన్న)
ఉత్తమ నేపథ్య గాయని : శక్తిశ్రీ గోపాలన్ (హాయ్ నాన్న )
ఉత్తమ గాయకుడు : రామ్ మిర్యాల (బలగం)
ఉత్తమ లిరిక్స్ రైటర్ : అనంత శ్రీరామ్ (బేబీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: భువన్ గౌడ (సలార్)

మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు..

టాలీవుడ్‌లో వివిధ నటీనటుల అభిమానులు తరచుగా ఆన్‌లైన్‌లో గొడవ పడుతూ ఉంటారు. నటీనటులు ఒకరితో ఒకరు బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నారనే వాస్తవాన్ని పట్టించుకోకుండా అప్పుడప్పుడు మాత్రమే పబ్లిక్‌గా గొడవ పడతారు. నాని, విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య పోటీ ఒక ముఖ్యమైన ఉదాహరణ. నాని, విజయ్ దేవరకొండ ఆఫ్ – స్క్రీన్ బాండింగ్‌ను నిజాయితీగా, స్నేహపూర్వకంగా కొనసాగిస్తున్నారు. ఈ విషయం ఓ ఈవెంట్‌లో మరోసారి రుజువైంది. దుబాయ్‌లో జరిగిన సైమా 2024 వేడుకలో, దసరా చిత్రంలో తన నటనకు నాని ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు.

అవార్డును ప్రదానం చేసిన విజయ్ దేవరకొండ నాని గురించి ఆప్యాయంగా మాట్లాడాడు. అభిమానులు తమ అభిమాన నటులను అన్నా అని ఎందుకు పిలుస్తారో తనకు ఎప్పుడూ అర్థం కాలేదని అతను అన్నాడు, అయితే అతను ఇప్పుడు నానిని అన్న అనే పదంతో సంబోధించాడు. విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రమణ్యంలో నానితో కలిసి పనిచేసిన మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇది ప్రేక్షకులను బాగా కదిలించింది. ఈ వేడుకలో ఇద్దరు నటులు ఒకరినొకరు కౌగిలించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News