Wednesday, January 22, 2025

అతని మాటలు స్ఫూర్తినిచ్చాయి

- Advertisement -
- Advertisement -

Sikandar Raza Thanks Ricky Ponting For Motivating

పెర్త్: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో జింబాబ్వేకు చారిత్రక విజయం సాధించి పెట్టిన స్టార్ క్రికెటర్ సికందర్ రజాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణ బౌలింగ్‌తో సికందర్ రజా పాకిస్థాన్ బ్యాటర్లను హడలెత్తించి జింబాబ్వేకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై సికందర్ రజా స్పందించాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఐసిసి నుంచి తనకు ఓ వీడియో సందేశం లభించింది. ఇందులో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ తనను ప్రశంసిస్తూ సందేహం పంపించాడు. అతని మాటలు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆ మాటలను ప్రేరణగా తీసుకుని పాకిస్థాన్ మ్యాచ్‌లో బంతితో రాణించాను. పాంటింగ్ వంటి దిగ్గజ క్రికెటర్ నుంచి ప్రశంసలు అందుకోవడాన్ని అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు సికందర్ వివరించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News