Thursday, December 19, 2024

జగద్గిరిగుట్టలో పోలీసులపై తల్వార్‌తో దాడి…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఓ హత్య కేసులో నిందితుడు శత్రువులు అనుకొని సివిల్ డ్రెస్సులో ఉన్న కానిస్టేబుళ్లపై తల్వార్‌తో దాడి చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఎస్‌ఒటి పోలీసులు రాజు, వినయ్ సిక్కు బస్తీకి వెళ్లారు. పోలీసులు సివిల్ డ్రెస్సులో ఉండడంతో శత్రువులుగా భావించి వారిపై తల్వార్‌తో దాడి చేశాడు. ఓ కానిస్టేబుల్ ఛాతి భాగంలో గాయాలు కాగా మరో కానిస్టేబుల్ తలపై గాయాలయ్యాయి. వెంటనే వారిని రాందేవ్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అడిషనల్ డిసిపి రవి కుమార్ ఆస్పత్రి చేరుకొని కానిస్టేబుళ్ల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News